![]() |
![]() |
.webp)
గుప్పెడంత మనసు సీరియల్ బిగ్ హీరో మహేంద్ర అలియాస్ సాయి కిరణ్ గురించి అందరికీ తెలుసు. రిషి తండ్రిగా మహేంద్ర పాత్రలో అద్భుతంగా నటిస్తున్నాడు. అలాంటి సాయి కిరణ్ ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటాడు. చేసే రీల్స్, వీడియోస్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. అలాంటి ఒక రీల్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. అది మాత్రం చూసే కొద్దీ చూడబుద్దేస్తుంది. కమోడ్ స్టైల్ డ్రెస్ తో ఒక నటిని ఇమిటేట్ చేసి చూపించాడు. ఇక ఆ వీడియో చూస్తే మాములుగా ఉండదు. ఒక హీరోయిన్ ఒక ఫంక్షన్ లో సోఫాలో కమోడ్ టైపు డ్రెస్ వేసుకొచ్చి ఆ ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళను పలకరిస్తూ కనిపించింది.
.webp)
ఆ వీడియోలో ఆ బిట్ వరకు కట్ చేసి ఇమిటేట్ చేసి చూపించాడు. "దీదీ కమోడ్ స్టైల్ ఫాషన్ డ్రెస్ వేసింది" అంటూ కమోడ్ ఇమేజిని కూడా పెట్టాడు. ఇక నెటిజన్స్ ఐతే నవ్వుకోలేక ఛస్తున్నారు. "మీ రీల్స్ వేరే లెవెల్ లో ఉంటాయి సర్. సర్..ఏంటి సర్ ఇది...నవ్వు ఆపుకోలేకపోతే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ..మీలో కనిపించని కామెడీ కోణం ఉంది. అయ్యా మీరు ట్రెండ్ సెట్ చేశారు. ఇకనైనా ప్యాంట్ వేసుకోండి...మీ నుంచి ఇలాంటి కామెడీ రీల్ ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సర్" అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
![]() |
![]() |